Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) పొలిటికల్ జర్నీలో అత్యంత కీలక ఘట్టం రానే వచ్చింది. ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు (ఏప్రిల్ 23) ముగిసింది. విజయ్ సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) తరపున బరిలో దిగుతుండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికల పైనే ఉంది. అయితే, విజయ్‌తో పాటు ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ త్రిష ఓటింగ్ సరళి కూడా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Vijay, Trisha

గత కొద్ది రోజులుగా విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పలు ఈవెంట్స్‌లో వీళ్లిద్దరూ కలిసి కనిపించడంతో.. ఈ ఎన్నికల ఓటింగ్ రోజున పోలింగ్ బూత్‌కు కూడా ఇద్దరూ జంటగానే వస్తారని తమిళ మీడియా ఎంతో ఆశగా వెయిట్ చేసింది. కానీ, విజయ్ మీడియాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇద్దరూ వేర్వేరు పోలింగ్ బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ్ నీలాంకరై కేంద్రంలో ఓటు వేయగా.. త్రిష తన తల్లితో కలిసి ఆల్వార్‌పేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేశారు. కనీసం అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయ్ పోలింగ్ సెంటర్‌కైనా ఆమె వస్తుందేమో అని మీడియా ఎదురుచూసినా.. అలా జరగలేదు.

ఓటు వేసి సైలెంట్‌గా వెళ్లిపోయిన త్రిష.. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి నెట్టింట సెన్సేషన్‌గా క్రియేట్ చేశారు. ఓటు వేసిన వేలును చూపిస్తూ త్రిష పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఆ ఫోటోకి విజయ్ నటించిన ‘గిల్లి’ మూవీలోని ‘అర్జునార్ విల్లు’ సాంగ్‌ను ఆమె యాడ్ చేశారు. పైగా టీవీకే పార్టీ సింబల్ అయిన ‘విజిల్’ సౌండ్ వచ్చే పార్ట్‌ను ఉద్దేశపూర్వకంగా కట్ చేసి మరీ పోస్ట్ చేయడం ఫ్యాన్స్‌కు క్లియర్ హింట్ ఇచ్చేసింది.దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. “గిల్లి సాంగ్.. కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్”, “నువ్వు ఎవరికి ఓటు వేశావో ఆ బీజీఎం చూస్తేనే అర్థమవుతోంది” అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. మొత్తానికి త్రిష పరోక్షంగా విజయ్ పార్టీకి ఏ రేంజ్‌లో సపోర్ట్ చేస్తుందో ఈ పోస్ట్‌తో క్లారిటీ వచ్చేసింది.

‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus