అవార్డ్ తోపాటు మనసు గెలుచుకున్న విజయ్!

  • June 18, 2018 / 05:47 AM IST

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ రిజల్ట్ టైమ్ లో గెలిచిన టీం కప్ గెలిచింది, ఓడిన టీం మనసు గెలిచింది అంటారు. కానీ.. మొట్టమొదటిసారిగా ఓ హీరో అవార్డ్ తోపాటు మనసులు కూడా గెలుచుకున్నాడు అంటున్నారు. అతను మరెవరో కాదు మన అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ. శనివారం సాయంత్రం హైద్రాబాద్ లో అట్టహాసంగా జరిగిన ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడం తెలిసిందే. “అర్జున్ రెడ్డి” సినిమాకిగానూ విజయ్ దేవరకోండ ఈ అవార్డ్ ను అందుకొన్నాడు. అయితే.. అందరిలా ఈ అవార్డ్ ను తీసుకెళ్లి తన ఇంట్లోని షెల్ఫ్ లోనో లేక ఆఫీస్ లోనో పెట్టుకోలేదు. ఏకంగా వేలం వేశాడు.

తనకు వచ్చిన మొట్టమొదటి అవార్డ్ ను వేలం వేసి.. ఆ వేలం ద్వారా వచ్చిన ఎమౌంట్ ను తెలంగాణా సి.ఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నాని ప్రకటించాడు. అందుకోసం విజయ్ దేవరకొండ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. అవార్డ్ కంటే మనోడి పోస్ట్ కి వస్తున్న రివార్డ్స్ ఎక్కువయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus