ఇప్పటినుండి అలాంటి నిర్ణయాలు అసలు తీసుకోను అంటున్న విజయ్ దేవరకొండ

  • November 17, 2018 / 11:04 AM IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో. ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో నానితో కలసి నటించి ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత హీరోగా ‘పెళ్లి చూపులు’ సినిమా చేసి మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ కి ‘అర్జున్ రెడ్డి’ సినిమా స్టార్ డమ్ తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత చేసిన ‘గీత గోవిందం’ 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లడంతో విజయ్ దేవరకొండ గ్రాఫ్ మరింత పెరిగింది. దీంతో వరుస ఆఫర్లు అతడిని వెతుకుంటూ వస్తున్నాయి. అయితే ఇటీవలే వచ్చిన ‘నోటా’ సినిమా నిరాశ పరచడంతో ఆ సినిమా పైన విజయ్ దేవరకొండ ఇలా స్పందించాడు.

గీత గోవిందం సినిమా చేస్తున్నప్పుడే ‘నోటా’, ‘టాక్సీవాలా’ సినిమాలు కూడా ఒప్పుకోవడంతో మూడు సినిమాలు ఒకేసారి చేయాల్సి వచ్చింది. ఇలా మూడు సినిమా షూటింగ్స్ లో ఎప్పుడు బిజీగా ఉండటం వలన ‘నోటా’ సినిమా కథ పైన కొంచం ఫోకస్ తగ్గింది. మేము ‘నోటా’ లో చెప్పాలనుకుంది ఇంకాస్త గట్టిగ చెబితే బాగుండేదేమో అని తరువాత అనిపించింది. మా అందరి అదృష్టం కొద్దీ ఆ సినిమా ఎక్కువగా నష్టపోలేదు. అందుకే ఇప్పటినుండి ఒక నిర్ణయానికి వచ్చాను , హడావిడిగా అస్సలు సినిమాలు చేయను. సినిమా సినిమాకి కాస్త గ్యాప్ వచ్చేలా చూసుకుంటానని చెప్పాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus