విజయ్ దేవరకొండ అనే వ్యక్తి హీరోగా తాను చేసిన సినిమాల ద్వారా కంటే.. సోషల్ మీడియాలో మరియు పబ్లిక్ ఈవెంట్స్ లో చేసే హడావుడి పుణ్యమా అని ఎక్కువ పాపులర్ అయ్యాడనేది అతడి అభిమానులు కూడా ఒప్పుకొనే విషయం. ముఖ్యంగా తనను తాను మార్కెట్ చేసుకోవడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడు ముందుంటాడు. నిన్న జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా విజయ్ దేవరకొండ తనను అక్కడికి ముఖ్య అతిధిగా ఆహ్వానించిన మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పడం లేదా సినిమా గురించి చెప్పడం మానేసి తన గురించి తాను చెప్పుకోవడం మరియు “మహర్షి” సినిమా తన పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతుందని, దాన్ని హిట్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని విజయ్ ఒకటికి రెండుసార్లు చెప్పడం మహేష్ అభిమానులకు పెద్దగా నచ్చలేదు.
అసలు విజయ్ దేవరకొండను ముఖ్య అతిధిగా పిలవడాన్నే ఇంకా కొందరు జీర్ణించుకోవడం లేదంటే.. ఇలా మహర్షి తన బర్త్ డే గిఫ్ట్ అని విజయ్ అనడం ఇంకొందరికి నచ్చడం లేదు. ఏదేమైనా విజయ్ తన సెల్ఫ్ మార్కెటింగ్ గోల్స్ ను రీచ్ అయినప్పటికీ.. ఆ చర్యలను మాత్రం అందరికీ నచ్చడం లేదు.