ప్రభాస్, ఎన్టీఆర్ లకు షాకిచ్చిన విజయ్ దేవర కొండ

కొత్త కథలతో వస్తున్న సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారు. విజయాన్ని అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం అనేక చిత్రాలు హిట్ అయి టాలీవుడ్ కి మరుపురాని ఏడాదిగా గుర్తిండిపోయింది. ఎక్కువ సినిమాలు సక్సస్ కావడంతో అవార్డుల విషయంలో గట్టి పోటీ ఏర్పడింది. ఉత్తమనటుడి కేటగిరీలో బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అద్భుత నటనకు ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. అతనికే ఈ అవార్డు వస్తుందని అందరూ ఇప్పటి వరకు పూర్తి నమకం తో ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ జై లవకుశలో మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించనున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత ప్రభాస్ తో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపించడం ఖాయం. వారిద్దరి మధ్యలోకి తాజాగా విజయ్ దేవరకొండ వచ్చారు. అర్జున్ రెడ్డిలో విజయ్ నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు. దీంతో “2017  ఉత్తమ నటుడు” విభాగంలో ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్ లకు విజయ్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అవార్డు ఎవరి చెంతకు వెళుతుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus