నా కెరీర్ లో చాలా కష్టపడి చేసిన చిత్రం టాక్సీవాలా

హీరోగా పదుల సంఖ్యలో సూపర్ హిట్ లు ఉన్న యువ కథానాయకులకు సైతం సొంతం అవ్వని స్టార్ డమ్ ను కేవలం మూడు చిత్రాలతో సాధించిన ఘనత విజయ్ దేవరకొండది. అలాంటి విజయ్ దేవరకొండ ఒకానొక సందర్భంలో “సినిమా మానేద్దాం” అనుకున్నాడట. అది కూడా అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ సక్సెస్ అనంతరం. ఇటీవల “టాక్సీవాలా” ప్రమోషన్స్ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని అందరితో పంచుకొన్నాడు విజయ్ దేవరకొండ. “టాక్సీవాలా” సినిమా షూటింగ్ సమయంలో విజయ్ మదర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఆ మెంటల్ టెన్షన్ లో కూడా “టాక్సీవాలా” షూటింగ్ చేశాడట విజయ్. ఆ సమయంలో షూటింగ్ లో సినిమాలు మానేద్దామా, ఇది నా వల్ల అవ్వడం లేదు అనుకొన్నాడట. అలా చాలా కష్టపడి వర్క్ చేసిన సినిమా విడుదలకి ముందే పైరసీ రూపంలో విడుదలవ్వడం చాలా బాధగా ఉందని చెప్పాడు విజయ్ దేవరకొండ.

రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ నిజానికి ఈరోజే విడుదలవ్వాలి. కానీ.. రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” కోసం రేపటికి వాయిదా వేశారు. మరి పైరసీ భూతం ఆల్రెడీ చాలా ఇబ్బందులకు గురి చేసిన ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందా లేదా అని రేపు ఉదయానికి తెలిసిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus