ప్రచారంలో ఉన్న విజయ్‌ దేవరకొండ కొత్త మూవీ టైటిల్‌

  • December 9, 2017 / 12:31 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో యువ హీరో విజయ్‌ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ నాలుగు ప్రాజెక్ట్ లను ఒకేసారి లైన్లో పెట్టారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో చేస్తున్న సినిమా తొందరగా పూర్తి అయ్యేలా ఉంది. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు బయటికి వచ్చింది. “గీతా గోవిందం” అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు అభినేత్రి సావిత్రి బయోపిక్‌ మూవీ “మహానటి”లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో విజయ్ కనిపించనున్నారు.

అతని పార్ట్ షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. అలాగే శ్రీధర్‌ మర్రి దర్శకత్వంలో “ఏ మంత్రం వేసావె” సినిమా చేస్తున్నారు. ఇందులో డాక్టర్ రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తెలుగు సినిమాలే కాకుండా తమిళ చిత్రం కూడా చేస్తున్నారు. “నడిగయ్యార్‌ తిలగం” అనే చిత్రంలో హీరోగా విజయ్ చేస్తున్నారు. ఇది హిట్ అయితే కోలీవుడ్ లోను అర్జున్ రెడ్డి జెండా పాతేయడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus