ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న సినిమాని వదులుకున్న విజయ్

  • November 29, 2018 / 04:21 AM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇలా తక్కువ టైమ్ లో ఇంత క్రేజ్ రావడంతో కథల విషయంలో ఈ రౌడీ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కంగారు పడి ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయనని ఒక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ రౌడీ కి నచ్చి వదిలేసినా సినిమా బాక్సాఫీస్ దగ్గర తప్పకుండ విజయం సాదిస్తుందని కొందరు అంటున్నారు.

ఇక విషయం లోకి వెళితే, ‘పెళ్లిచూపులు’ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ అజయ్ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా కథని మొదటగా విజయ్ కి చెప్పగా కథ నచ్చిందని కొన్ని రోజుల తరువాత సినిమా చేద్దాం అని చెప్పగా ఆ తరువాత అర్జున్ రెడ్డి రావడం బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. దీంతి ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథకి కొత్త హీరో అయితే బాగుంటుందని కార్తికేయ తో సినిమా చేయగా ఈ సినిమా మంచి విజయ సాధించింది. ఇక ‘హుషారు’ అనే సినిమా తీస్తున్న శ్రీహర్ష కొనుగంటి ఇటీవలే ఒక ఇంటర్వూలో, ఈ సినిమా కథ మొదటగా విజయ్ దేవరకొండ కి చెప్పాగా ఆయనకి బాగా నచ్చిందని కానీ ఇందులో నలుగురు హీరోలు ఉండటం వలన ఒప్పుకోలేదు కానీ సోలో హీరో కథ ఉంటె చెప్పు తప్పకుండ చేద్దామన్నాడని చెప్పాడు. మరి విజయ్ దేవరకొండ కథ నచ్చి వద్దనుకున్నా ఈ హుషారు సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus