వాడికి సినిమా వెనుక కష్టం తెలియాలనే, ఇప్పటివరకూ సపోర్ట్ చేయలేదు: విజయ్

  • July 8, 2019 / 12:37 PM IST

“దొరసాని” టీజర్ & ట్రైలర్ విడుదలయ్యాక సదరు ప్రోమోస్ లోని కంటెంట్ మరియు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కంటే ఎక్కువగా అందరూ డిస్కస్ చేసుకున్న విషయం “విజయ్ దేవరకొండ ఎందుకని సదరు టీజర్ & ట్రైలర్ ను షేర్ చేయలేదు” అనే. సొంత తమ్ముడి సినిమాను కాకుండా ఫ్రెండ్స్ సినిమాలను మరియు తన సినిమాను మాత్రమే ప్రమోట్ చేసుకొంటున్న విజయ్ తమ్ముడిని కావాలనే పట్టించుకోవడం లేదా అని పోలోమని విశ్లేషణలు వచ్చాయి. వాటన్నిటికీ ఒకేసారి సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. నిన్న జరిగిన “దొరసాని” ప్రీరిలీజ్ ఈవెంట్ ఎందరికో కనువిప్పుగా నిలిచింది.

అసలు విజయ్ దేవరకొండ హీరోగా మారేప్పుడు ఆనంద్ దేవరకొండ ఎంతలా సపోర్ట్ చేశాడు అని విజయ్ కన్నీరు పెట్టుకొని మరీ వేదిక సాక్షిగా అందరితో ఆ అనుభవాలను పంచుకోవడం ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక తాను కావాలనే టీజర్ కానీ ట్రైలర్ కానీ షేర్ చేయలేదు, చేయాలి అనిపించినా నన్ను నేను కంట్రోల్ చేసుకొన్నాను అని విజయ్ చెప్పడం గమనార్హం. ఆనంద్ కి సినిమా తీయడం, రిలీజ్ చేయడం వెనుక కష్టం తెలియాలి అందుకే నేను ఇప్పటివరకూ వాడికి సపోర్ట్ చేయలేదు. అయినా.. వాడు అమెరికా నుండి ఉద్యోగం మానేసి వచ్చేస్తానని చెప్పడం, వచ్చాక సినిమా హీరోగా చేస్తాను అని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ.. మొన్న సినిమా చూసిన తర్వాత మాత్రం నా తమ్ముడి ప్రయత్నానికి గర్వపడుతున్నాను” అని విజయ్ చెమర్చిన కళ్ళతో చెప్పడంతో “దొరసాని” సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus