రౌడీ అబ్బాయ్ ఫిలిమ్ ఫేర్ వేలం విలువ 25 లక్షలు!

  • July 16, 2018 / 07:20 AM IST

గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా ఓన్లీ జీన్స్ ప్యాంట్ తో “రౌడీ” అంటూ ప్రమోషన్స్ మొదలెట్టాడు. తొలుత చాలా మంది అదేదో కొత్త సినిమా లుక్ అనుకోగా.. తర్వాత అది తన బ్రాండ్ “రౌడీ క్లబ్” ప్రమోషన్స్ అని అర్ధమైంది. సల్మాన్ ఖాన్ “బీయింగ్ హ్యూమన్” తరహాలోనే విజయ్ దేవరకొండ కూడా “రౌడీ క్లబ్” అనే బ్రాండ్ మొదలెట్టాడు. ఈ బ్రాండ్ కర్టెన్ రైజర్ నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. రెగ్యులర్ ఈవెంట్స్ లా కాకుండా తనదైన విభిన్నమైన శైలిలో ఈ ఈవెంట్ ను విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా ప్లాన్ చేయడం విశేషం.

ఇకపోతే.. తన మొట్టమొదటి ఫిలిమ్ ఫేర్ ను వేలం వేసి ఆ మొత్తాన్ని సి.ఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తానని విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటను కూడా ఇదే స్టేజ్ మీద నిలబెట్టుకొన్నాడు. దీవి లేబరేటోరీస్ సంస్థ ఫిలిమ్ ఫేర్ ను 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి విజయ్ దేవరకొండకు ఆ చెక్ అందించారు. ఆ మొత్తాన్ని సి.ఎం రిలీఫ్ ఫండ్ కు త్వరలోనే కేటీఆర్ కు అందజేయనున్నాడు విజయ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus