వాట్ ఈజ్ మిస్టర్ విజయ్ దేవరకొండ డూయింగ్ ?!

  • September 14, 2018 / 02:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని కథానాయకుడిగా తనకంటూ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకోవడమే కాక స్టార్ డమ్ క్రియేట్ చేసుకొన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం మనోడి పేరు ఒక బ్రాండ్, మనోడి వెనుక అందరు అగ్ర నిర్మాతలు క్యూ కట్టడమే కాదు.. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లు కథలు చెప్పడం కోసం అతడి వెనుక తిరుగుతున్నారు. ఇక అమ్మాయిల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి కుళ్లుకొని కథానాయకుడు లేడు. విజయ్ ని ఒక్కసారి డైరెక్ట్ చూసినా చాలు అనుకొనే అమ్మాయిలున్నారు, ఇక అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా హగ్ చేసుకోవడం కోసం వెంపర్లాడే అమ్మాయిల సంఖ్య లెక్కించడానికి కనీసం వారం పడుతుంది.

అలాంటి విజయ్ దేవరకొండ తనపై మనసుపారేసుకున్న వేలాది అమ్మాయిల గుండెల్ని ఒక్కసారిగా బ్రేక్ చేసాడు. ఎప్పటినుంచో విజయ్ ఒక రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలొచ్చినప్పటికీ ఆ రిలేషన్ ను సీక్రెట్ గా ఉంచాడు. కానీ.. విజయ్ ఈ విషయాన్ని పబ్లిక్ చేయలనుకొన్నాడో లేక పొరపాటున ఆ అమ్మాయి పబ్లిక్ చేసేసిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ – విమ్మి (ది వైట్ హైదరాబాదీ) ల రిలేషన్ పబ్లిక్ అయిపోయింది. “పెళ్లిచూపులు” విడుదలకు ముందు నుంచీ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు ఆమె ఇన్స్టా గ్రామ్ ప్రొఫైల్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ వెళుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో, డియర్ లేడీ విజయ్ ఫ్యాన్స్ ఆర్జెంట్ గా ఇంకో క్రష్ ను వెతుక్కోవడమో లేక ఆల్రెడీ తమకు ప్రపోజ్ చేసి వెయిట్ చేస్తున్న మంచి కుర్రాళ్ళ ప్రేమను అంగీకరించడమో చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus