‘డియర్ కామ్రేడ్’ రిజల్ట్ పై స్పందించిన విజయ్ దేవరకొండ

  • August 19, 2019 / 01:22 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు విజయ్. అంతేకాదు తన ప్రతీ సినిమాని విభిన్న పద్దతిలో ప్రమోట్ చేసి.. ఆ సినిమాకి భారీ హైప్ ను తీసుకొస్తుంటాడు. అదే కోవలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని కూడా ప్రమోట్ చేశాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కంటెంట్ బాగున్నప్పటికీ కథనంలో వేగం లోపించడంతో సినిమా ప్లాప్ గా మిగిలింది. తాజాగా ఈ చిత్రం ఫలితం పై స్పందించాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ… “ఇండస్ట్రీలో కొందరు నా పై అలాగే నా సినిమాలపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా పై నెగెటివిటీ ప్రచారం చేసి ఆ చిత్రాన్ని చంపేశారు. ఐతే ఇలాంటివి నాకేమి కొత్త కాదు… ఇలాంటి ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు” అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన ‘సైమా అవార్డ్స్’ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడుగానూ… అలాగే సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ కేటగిరీలోనూ రెండు అవార్డులు దక్కించుకున్నాడు ఈ రౌడీ హీరో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus