‘టాక్సీవాలా’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గీత గోవిందం’ తరువాత మరోసారి విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న జతకడుతుంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
గత కొంత కాలంగా కాకినాడలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. అందువలన కాకినాడ కాలేజ్ లోను .. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ షెడ్యూల్ మొత్తం పూర్తయ్యిందట. ఇక విజయ్ – రష్మిక మధ్య చిత్రీకరించిన సీన్స్ చాలా బాగా వచ్చాయని సమాచారం. సమ్మర్ కానుకగా మే నెల రెండవ వారంలో ‘డియర్ కామ్రేడ్’ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.