హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్

  • August 29, 2018 / 01:04 PM IST

గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తన ఇమేజ్ కు తగ్గట్లుగా రెమ్యునరేషన్ ని అమాంతం పెంచాడట ! ఇంతకీ విజయ్ దేవరకొండ పెంచిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా 8 కోట్లట! గీత గోవిందం చిత్రానికి ముందు ఈ హీరో అందుకుంటున్న సొమ్ము కేవలం 3 నుండి 5 కోట్లు మాత్రమే. కానీ గీత గోవిందం ప్రభంజనం సృష్టిస్తుండ టంతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లో చేరిపోవడంతో తన రెమ్యునరేషన్ ని 8 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది .

నిన్న మొన్నటి వరకు కొత్తవాళ్లు , లేదంటే చిన్న చిన్న నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించేవాళ్ళు కాబట్టి ఇప్పటి విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ చిన్న నిర్మాతల పాలిట శరాఘాతమే ! అయితే పెద్ద చిత్రాలు తీసే నిర్మాతలకు మాత్రం ఈ రెమ్యునరేషన్ పెద్ద ఇబ్బందేమీ కాదు పైగా విజయ్ దేవరకొండ చిత్రాలు ఇప్పుడు 50 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి కాబట్టి ఈ భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వడానికి అగ్ర నిర్మాతలు ముందుకు వస్తారు కానీ చిన్న నిర్మాతలకు మాత్రం విజయ్ దేవరకొండ అందకుండా పోయాడు రెమ్యునరేషన్ పెంచడంతో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus