Vijay Thalapathy: విజయ్ ఆఖరి సినిమాకు మొదటి టైటిల్.. కొత్తగా ఉందే..!

Advertisement

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుత హాట్ టాపిక్‌గా మారిన విజయ్‌ (Vijay Thalpathy)  69వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లో చివరి చిత్రం కావొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదీ కాక, ఈ సినిమా కథ తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన ‘భగవంత్‌ కేసరి’కి (Bhagavath Kesari) రీమేక్‌ అని సమాచారం. తెలుగులో విజయవంతమైన ఈ కథను తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు వినోథ్ (H Vinoth)  స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Vijay Thalapathy

విజయ్‌ (Vijay Thalapathy) నటించిన మొదటి చిత్రం టైటిల్ ‘నాలయ తీర్పు’ (తెలుగులో రేపటి తీర్పు) అని, అదే పేరును ఈ చివరి చిత్రానికి పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ టైటిల్‌ కేవలం కథకు సరిపోయేలా కాకుండా, విజయ్‌ కెరీర్‌కు భావోద్వేగ పునాది కూడా అవుతుందనే ఉద్దేశ్యంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా టైటిల్‌నే చివరి సినిమాకు పెట్టడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకునే అంశమవుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తుండగా, మలయాళ నటి మమిత బైజు  (Mamitha Baiju)  కీలక పాత్రలో కనిపించనున్నారు.

తెలుగు వెర్షన్‌లో శ్రీలీల (Sreeleela)  పోషించిన పాత్రను మమిత తలపించబోతున్నారు. ఇదే కాకుండా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి. కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఇక ఈ చిత్రానికి ‘నాలయ తీర్పు’ అనే టైటిల్ పరిశీలించడానికి మరో ప్రత్యేక కారణం ఉంది. విజయ్‌ తొలి చిత్రం ఈ టైటిల్‌తో ఉండటం అభిమానుల్లో ఓ నోస్టాల్జిక్ కనెక్షన్ తీసుకురాగలదని భావిస్తున్నారు.

తన సినీ ప్రయాణాన్ని ఒక మలుపుగా చూపేలా ఈ టైటిల్‌ కచ్చితంగా విజయ్‌ అభిమానుల హృదయాలను తాకుతుందనే నమ్మకం ఉంది. టైటిల్‌, టీజర్‌తో సినిమా ప్రమోషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇంతటి భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం విజయ్‌ (Vijay Thalapathy) కెరీర్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది. కథ, టైటిల్, సెంటిమెంట్ అన్నీ కలిసొస్తే ఈ చిత్రం విజయ్‌కి నిజంగా మరో పెద్ద విజయం అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇదేం దిక్కుమాలిన క్వశ్చన్ రా బాబు.. ‘కె.పి.హెచ్.బి’ ఆంటీ అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news