‘మెగా 152’ లో విజయశాంతి?

  • August 27, 2019 / 02:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇది మెగాస్టార్ కు 151 వ చిత్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తయిన తరువాత చిరు కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈమధ్యే కొరటాల ఆమెను కలిసి కథ వినిపించాడని. ఆమె కూడా పాజిటివ్ గా స్పందించిందని తెలుస్తుంది. చిరు, విజయశాంతి కాంబినేషన్ అంటే ఆల్ టైం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే.

అయితే ఇన్నాళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విజయశాంతి ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే విషయం పై డిస్కషన్లు మొదలయ్యాయి. హీరోయిన్ గా చేసే అవకాశం ఎలాగూ ఉండదన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతుందనే డౌట్ అందరిలోనూ ఉంది. ఇక విజయశాంతి 13 ఏళ్ళ తరువాత ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరి కొరటాల, చిరు కాంబినేషన్లో ఈమె నిజంగా నటిస్తుందా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus