అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.65 cr |
సీడెడ్ | 0.21 cr |
ఉత్తరాంధ్ర | 0.11 cr |
ఈస్ట్ | 0.10 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.05 cr |
కృష్ణా | 0.06 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.29 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.06 cr |
ఓవర్సీస్ | 0.09 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.44 cr (షేర్) |
‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీ రూ.1.44 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.3.06 కోట్లు షేర్ ను రాబట్టాలి.