‘వినరో భాగ్యము విష్ణు కథ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Advertisement

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.3 cr
సీడెడ్ 0.60 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.21 cr (షేర్)

‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus