ఆకట్టుకోని వినయ విధేయ రామ ట్రైలర్ & సాంగ్స్

  • December 28, 2018 / 05:35 AM IST

నిన్న సాయంత్రం జరిగిన మెగా ఈవెంట్ లో త్రివిక్రమ్, కేటీఆర్, రామ్ చరణ్ స్పీచ్ లైనా జనాల్ని ఆకట్టుకొన్నాయేమో కానీ.. విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ మాత్రం జనరల్ ఆడియన్స్ ను కాదు కదా కనీసం మెగా అభిమానులను కూడా అలరించలేకపోయింది. అసలే ట్రైలర్ కట్ బాలేదు, ఏవో నాలుగు ఫైట్ సీన్స్ లో నుంచి కొన్ని సీక్వెన్స్ లు కట్ చేసి ట్రైలర్ లో యాడ్ చేశారు తప్పితే.. ట్రైలర్ కి కట్ ఒక జస్టీఫికేషన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే.. ఉరమాస్ ఎలిమెంట్స్ & మాస్ ఎలివేషన్స్ మాత్రం గట్టిగా ఉంటాయన్న హింట్ మాత్రం ఇచ్చాడు బోయపాటి.

ఇక ఉదయం విడుదలైన దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ఆల్బమ్ మరియు వీడియో సాంగ్ ప్రోమోస్ అయితే అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. దేవిశ్రీప్రసాద్ పాటలన్నీ ఎక్కడో విన్నాం అనిపించగా.. సాంగ్ ప్రోమోస్ లో చరణ్ గ్రేస్ తప్ప ఏమీ కనిపించలేదు. అయితే.. బోయపాటి సినిమాలకు మ్యూజికల్ ఆల్బమ్ హిట్ అయిన చరిత్ర లేదు కాబట్టి ఆల్బమ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. ట్రైలర్ మాత్రం సంతృప్తికరంగా లేకపోవడం గమనార్హం. మరి సినిమాతోనైనా మెగా అభిమానులను సంతుష్టులను చేస్తాడో లేక థియేటర్ లోనూ హాఫ్ మీల్సే పెడతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus