ఏ భాషలో అయినా స్టార్ హీరోల మధ్య సఖ్యత సరిగా ఉండదని, కనీసం ఒకరి మొఖాలు ఒకరు చూసుకోరని మనం వింటుంటాం. కానీ.. తమిళనాట మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది.
ఇటీవల విజయ్ తాజా చిత్రం “తేరీ”ని బెంగుళూరు బస్ లో పైరసీ సీడీ ద్వారా ప్రదర్శించారట. ఈ విషయంలో బస్ లో ప్రయాణం చేస్తున్న విశాల్ సన్నిహితుడొకడు విశాల్ కు తెలియజేశాడు. వెంటనే రెస్పాండ్ అయిన విశాల్.. సదరు బస్ లో మధ్యలో ఆపుజేయించి.. బస్ డ్రైవర్ ను అరెస్ట్ చేయించడంతోపాటు మేనేజ్ మెంట్ పై కేసు కూడా వేయించాడట.
అలాగే.. ఈ పైరసీ చేసే గ్యాంగ్ వివరాలు తనకు తెలిసాయని, త్వరలోనే వారి ఆట కట్టిస్తానని, తన తాజా చిత్రం “రాయుడు”ను వారు పైరసీ చేయలేరని సవాలు విసిరాడు విశాల్. మరి పైరసీదారులు విశాల్ విసిరినా సవాలుకు ఏవిధంగా సమాధానం చెబుతారో చూడాలి!