కావాలనే నా సినిమా గురించి చెడుగా చెప్పారు?

Advertisement

ఇటీవల విడుదలైన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసాడు. అయితే ఈ చిత్రం విడుదలైన రోజు నుండీ రక రకాల వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు నా చిత్రం పై నెగిటివిటీ ని ‘స్ప్రెడ్’ చేస్తున్నారంటూ రంగంలోకి దిగి ఫైర్ అయ్యాడు విశ్వక్ సేన్. ‘నా చిత్రం పై ఎందుకు ఇలా నెగెటివిటీ చేస్తున్నారో అర్ధం కావట్లేదు అయినా నేను భయపడను.. ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తాను’ అంటూ ప్రమోషన్లలో ఈ హీరో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐ డ్రీమ్స్ ఇకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు విశ్వక్సేన్.

ఈ ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ… “సాధారణంగా మొదటి రోజు సినిమా చూసి థియేటర్స్ లో నుంచి వచ్చేవారు, మీడియా వారికి తమ అభిప్రాయం చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ కొన్ని బ్యాచులు రంగంలోకి దిగి, నా సినిమా బాలేదని చెప్పాయి. పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ప్రకారం .. కావాలనే వాళ్ళు అలా చేశారు. ఆ తరువాత నా సినిమా పోస్టర్స్ చింపడం కూడా చేసారు. అందుకే నాకు అంత కోపం వచ్చింది. నా సినిమా బాగుంది కాబట్టే.. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus