Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మధ్యనే ‘వీరభద్రుడు’తో(‘కరుప్పన్’ తమిళంలో) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత సూర్య ఖాతాలో భారీ హిట్ పడింది. ఇంతలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath And Sons) అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూర్య. తెలుగులో సూర్య చేసిన స్ట్రైట్ మూవీ ఇది. వెంకీ అట్లూరి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vishwanath And Sons

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డ్ బాగుండటం, అలాగే సూర్య కంబ్యాక్ ఇవ్వడం, మామితా బైజు హీరోయిన్ కావడంతో .. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ కే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్ట్ చేసింది. మొదటి వీకెండ్ కే సూపర్ హిట్ లిస్టులో చేరింది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  12.50 cr
సీడెడ్  1.90 cr
ఆంధ్ర(టోటల్) 10.64 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 23.15 cr
తమిళనాడు 19.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + మలయాళం 9.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.80 cr
 ఓవర్సీస్ 29.56 cr
వరల్డ్ వైడ్ టోటల్ 82.7 cr(షేర్)

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.63.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే 8 రోజులు పూర్తయ్యేసరికి రూ.82.7 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.150.6 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.18.7 కోట్ల లాభాలు అందించింది. 2వ వీకెండ్ ను కూడా ఈ సినిమా గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus