బోయపాటి సినిమాకి వివేక్ ఒబెరాయ్ ఎంత తీసుకున్నారో తెలుసా ?

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. రాజవంశస్థుల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ హీరో), నవీన్‌ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ (సొంతం) నటిస్తున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు.

విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ పోటీపడుతున్నారు. రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు వారికి దగ్గరైన ఈ నటుడు ఈ సినిమా నాకోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. నాలుగు కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్టు తెలిపారు. ఒక తెలుగు సినిమాకి విలన్ కి నాలుగు కోట్లు ఇవ్వడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు చెప్పారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్ తెలుసుకోవాలని, ఫస్ట్ లుక్ చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus