నరేంద్రమోడీ బయోపిక్ లో వివేక్ ఒబెరాయ్

  • January 5, 2019 / 06:42 AM IST

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు ప్ర‌ముఖ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌. మోడీ బ‌యోపిక్ పీఎం న‌రేంద్ర‌మోడీ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నుండ‌గా ఈ చిత్రాన్ని ఒమంగ్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. సందీప్ ఎస్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ఈ నెల 7న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కానుంది.

ఈ నెల మూడో వారం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మోడీ పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ గ‌త ఏడాదిన్న‌ర నుండి జ‌రుగుతుంద‌ట‌. స్క్రిప్ట్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే త‌దిత‌ర అంశాల‌పై ఒమంగ్ కుమార్ టీం భారీ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. నార్త్‌తో పాటు సౌత్‌లోను క్రేజ్ పెంచుకున్న వివేక్ ఒబేరాయ్ అయితే చిత్రానికి దేశ‌మంత‌టా ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని భావించి మోడీ పాత్ర‌లో వివేక్‌ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. మరి విలన్ గా ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో సెటిల్ అవుతున్న వివేక్ కి ఈ బయోపిక్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus