మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. దాంతో పాటు ‘లూసిఫర్’ రీమేక్ లో కూడా నటించడానికి ప్లాన్ చేస్తూ వచ్చారు. మొదట ‘సాహో’ దర్శకుడు సుజీత్.. ‘లూసిఫర్’ రీమేక్ ను తెరకెక్కిస్తాడని ప్రకటించారు. కానీ అతను తప్పుకోవడంతో వినాయక్ వచ్చి చేరాడు. మెగాస్టార్ కు అత్యంత సన్నిహితుడు కాబట్టి..
వినాయక్ ఈ రీమేక్ కు ఫైనల్ అయినట్టే అనే ప్రచారం జరిగింది. మెగాస్టార్ కు కూడా వినాయక్ డైరెక్షన్లోనే చెయ్యాలని ఉంది. అయితే స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా ఆయన సంతృప్తి చెందలేదని వినికిడి. వినాయక్ కంటే బెటర్ గా మరో దర్శకుడు ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ను రెడీ చేస్తారేమో అని చిరు అన్వేషిస్తున్నారట. అలా లేని పక్షంలో కచ్చితంగా వినాయక్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నారట. అందుకే వినాయక్ పుట్టినరోజు నాడు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వలేదని తెలుస్తుంది.
‘ఇప్పటికే వినాయక్ హీరోగా నటించాల్సిన ‘సీనయ్య’ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు చిరు చిత్రం కూడా ఆగిపోతే ఎలా?’ అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?