‘పటాస్’ షో తో శ్రీముఖి ఎంత పాపులారిటీ సంపాదించుకుందో.. యాంకర్ రవి కూడా అంతే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ షో సూపర్ హిట్ అవ్వడానికి.. వారు ఎంతో కృషి చేశారనే చెప్పాలి. వారి ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించారు. అయితే ఈ ఇద్దరి యాంకర్ల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్టు.. ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత శ్రీముఖి.. ‘పటాస్’ నుండీ తప్పుకోవడంతో.. ఆ వార్తలు నిజమే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. తరువాత వీరి మధ్య గొడవలు పెరిగినట్టు కూడా టాక్ వినిపించింది. కొన్నాళ్ళ తరువాత రవి కూడా ‘పటాస్’ నుండీ తప్పుకున్నాడు. అయితే తాజాగా ఈ విషయం పై యాంకర్ రవి స్పందించాడు.
రవి మాట్లాడుతూ.. “శ్రీముఖికి నాకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు,. ఆమె నా వల్ల షో నుంచి వెళ్ళిపోలేదు. నాకు అస్సలు సంబంధం లేదు. ఆమె పర్సనల్ రీజన్స్ తోనే తప్పుకుంది. ఆ తరువాత ‘బిగ్ బాస్3’ కి వెళ్ళింది. శ్రీముఖి మంచి కో యాంకర్. ఒక్క పంచ్ వేస్తే.. వెంటనే కౌంటర్ గా పది పంచ్ లు వేస్తుంది. ఇప్పటికీ ఆమె నాకు మంచి ఫ్రెండ్. శ్రీ వెళ్ళిపోయిన తరువాత డైరెక్టర్ సంతోష్ కూడా వెళ్ళిపోయాడు. ఓ మంచి అవకాశం వచ్చినప్పుడు.. ఇప్పుడు చేస్తున్న దాన్ని పక్కన పెట్టడం చాలా కామన్. అలాగే శ్రీ ముఖి ‘బిగ్ బాస్3’ కమిట్మెంట్ కోసం వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. నేను కూడా అలాంటి ఆలోచనతోనే బయటకు వచ్చేశాను. అంతే గాని మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల పై ఎన్నిసార్లు సమాధానం ఇచ్చినా వార్తలు రాసేవాళ్ళు.. అబద్దాలు రాస్తూనే ఉన్నారు. అందుకే అనవసరంగా స్పందించడం ఎందుకని కొన్నిసార్లు పట్టించుకోవడం లేదు.” అంటూ చెప్పుకొచ్చాడు.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!