నితిన్, విజయ్ దేవరకొండలలో ఎవరు గెలుస్తారు?

Advertisement

జయం, దిల్ సినిమాలతో నితిన్ నిజం మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలాకాలం హిట్ కి దూరంగా ఉండి ఇష్క్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. అప్పటి నుంచి అప్పుడప్పుడూ హిట్స్ సొంతం చేసుకొని స్టడీగా కొనసాగుతున్నారు. అతని సినిమాలు నైజాం లో మంచి కలక్షన్స్ రాబడుతుంటాయి. అయితే అతని జోరుకు బ్రేక్ వేసే హీరో రెడీ అయిపోయాడు. అతనే విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో తెలంగాణ పవర్ స్టార్ గా పిలిపించుకుంటున్నారు. అతని సినిమాపై భారీ క్రేజ్ ఉంది. దీంతో నితిన్ జోరుకు విజయ్ అడ్డుగా మారారు. నితిన్ నటించిన “శ్రీనివాస కళ్యాణం” టీజర్ ఈ ఆదివారం రిలీజై మిలియన్ ప్లస్ (10లక్షలు పైగా) వ్యూస్ దక్కించుకుంది.

అదే రోజు రావాల్సిన దేవరకొండ “గీత గోవిందం” టీజర్ ఒకరోజు ఆలస్యంగా వచ్చింది. ఈ సోమవారం రిలీజైన ఈ టీజర్ కి కేవలం 18 గంటల్లోనే 2.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంటే దాదాపు 28లక్షల వ్యూస్ కొన్ని గంటల్లోనే సాధ్యమైంది. టీజర్ విషయంలో విజయ్ అవలీలగా నితిన్ ని బీట్ చేసాడు. ఆగస్టు 9న “శ్రీనివాస కళ్యాణం” రిలీజవుతుంటే ఆగస్టు 15న గీత గోవిందం విడుదలవుతోంది. మరి సినిమా కలక్షన్స్ విషయంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus