పవన్ కళ్యాణ్ మాజీ భార్య మళ్ళీ వార్తల్లో వ్యక్తి గా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకి రెండో పెళ్లి చేసుకోవాలని ఉందనే కోరికను బయట పెట్టడం తో వార్ మొదలయింది. “నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. కానీ నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించింది” అని అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. “మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చచ్చినంత ఒట్టు.
మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌరవం తగ్గిపోతుంది. పవన్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వదిన అంటాం. మీ నిర్ణయంతో అందరూ బాధపడే అవకాశం ఉంది.” అంటూ రకరకాలుగా ఫేస్ బుక్ వేదికగా రేణు దేశాయ్ ని అభిమానులు విమర్శించారు. దీనిపై రేణు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ” మగాడు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు… ఒక అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా?.. నేను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా?” అని విమర్శకులపై విరుచుకు పడ్డారు. “అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలు వారి కుమారులను పద్ధతిగా పెంచాలని” అని సూచించింది. పవన్ ఫ్యాన్స్, రేణు దేశాయ్ ల తీరు చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ముగిసేలా లేదు.