చిరంజీవి, రాధిక… ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. దానికంటేమించి… మంచి మిత్రులు. ఇద్దరూ ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా పలకరించుకొంటారు. నా ఫేవరెట్ కోస్టార్ రాధిక.. అని చిరు చెప్పిన సందర్భాలు బోల్డన్ని ఉన్నాయి. అయితే తొలి రోజుల్లో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారట. ఓసారి చిరు రాధికని, రాధిక చిరుని చెంప దెబ్బలు కూడా కొట్టుకొన్నారట.
ఈ విషయాన్ని వీళ్లిద్దరితో కలసి పనిచేసిన కోదండరామిరెడ్డి ప్రస్తావించారు. ‘న్యాయం కావాలి’లో చిరు, రాధిక కలసి నటించారు. దానికి కోదండ రామిరెడ్డి దర్శకుడు. ఓ సన్నివేశంలో రాధిక చిరుని చెంపదెబ్బ కొట్టాలట. పాత్రలో లీనమైపోయిన రాధిక నిజంగానే చిరుని చెంపదెబ్బ కొట్టిందట.
ఆ మరుసటి సన్నివేశంలో చిరు రాధికని కొట్టే సందర్భం ఉందట. అందులో చిరు కూడా నిజంగానే కొట్టేశాడట. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైందట. కానీ అదంతా త్వరగానే సర్దుకొని… వీళ్లిద్దరూ మళ్లీ మళ్లీ సినిమాలు చేశారని చెప్పుకొచ్చారు సీనియర్ దర్శకుడు.