ఆన్లైన్ లో రాజశేఖర్ కమ్ బ్యాక్ ఫిలిమ్

  • February 16, 2018 / 06:47 AM IST

అసలు రాజశేఖర్ అనే హీరో ఉండేవాడు అని జనాలు మర్చిపోతున్న తరుణంలో ‘పి.ఎస్.వి గరుడవేగ’తో సూపర్ హిట్ కొట్టడమే కాక కథానాయకుడిగా తన స్టామినాను, నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకొన్నాడు రాజశేఖర్. సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, రాజశేఖర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న ఈ చిత్రం ఇప్పుడు ఆన్ లైన్ లో ఎవైలబుల్ గా ఉంది. సన్ నెట్వర్క్ కి సంబంధించిన “సన్ నెక్స్ట్” యాప్ లో “గరుడ వేగ” ప్రస్తుతం లైవ్ స్ట్రీమ్ అవుతోంది.

సో, రాజశేఖర్ అభిమానులు మాత్రమే కాక మంచి సినిమాలు ఆదరించే సినిమా అభిమానులు మరియు వైవిధ్యమైన చిత్రాలు, హాలీవుడ్ సినిమాలను ఇష్టపడేవారు “గరుడవేగ”ను “సన్ నెక్స్ట్”లో తప్పకుండా చూడాల్సిందే. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు, ఫ్యామిలీ సెంటిమెంట్స్, సన్నీలియోన్ హాట్ హాట్ ఐటెమ్ సాంగ్ వంటి వాటి కోసం ఈ సినిమాని సెకండ్ టైమ్ చూడడంలో ఎలాంటి తప్పు లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus