ఘనంగా అలీ కూతురు హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. 

అతని పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం త్వరలోనే ఘనంగా జరగబోతుంది

ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అలీ పెద్ద కుమార్తె వివాహానికి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని, మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించారు అలీ దంపతులు. 

దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెళ్లి డేట్ దగ్గర పడుతుండడంతో సినీ, రాజకీయ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించేందుకు అలీ దంపతులు..

గ్యాప్ లేకుండా వారి ఇళ్లకు వెళ్లి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. మరోపక్క హల్దీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకలో అలీ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

అలీ భార్య జుబేదా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది.ఇక ఆ వీడియోని, ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి