హాట్ టాపిక్ గా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఆటో రాంప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు..!

‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సెలబ్రిటీలు అయిపోయిన వారి లిస్ట్ పెద్దదే.  అయితే ఇందులో స్టార్స్ గురించి చెప్పుకోవాలి అంటే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ల గురించి చెప్పుకోవాలి. 

వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేక్షకులు వీళ్ళ స్కిట్ లు చూసి విపరీతంగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ ముగ్గురు చేసే స్కిట్లు అంత బాగా పండడానికి ముఖ్య కారణం వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ అని కూడా చెప్పొచ్చు.

అందుకే అవి ఎక్కడా కూడా నటిస్తున్నట్టు అనిపించవు. నిజజీవితంలో ముగ్గురు స్నేహితులు జోకులు వేసుకుంటున్నట్టే కనిపిస్తుంది.

 ఈ ముగ్గురూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. సుడిగాలి సుధీర్ అయితే హీరో అయిపోయాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాలోడు’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. 

మిక్స్డ్ టాక్ తో కూడా ఆ మూవీ మాస్ సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సుడిగాలి సుధీర్ క్రేజ్ వల్లే ఈ సినిమా సక్సెస్ అందుకుంది అనే మాట వాస్తవం.

ఇక ‘గాలోడు’ సక్సెస్ ను తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లతో సెలబ్రేట్ చేసుకున్నాడు సుధీర్. 

అయితే ఈ ఫొటోల్లో ఆటో రాంప్రసాద్ నెత్తికి ఏదో కవర్ తొడిగినట్టు ఉంది. ఈ ఫోటోలపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

రాంప్రసాద్ కు ఏమైంది ఏమైంది అంటూ వాళ్ళ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘గాలోడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాంప్రసాద్ హాజరు కాలేదు.

కానీ గెటప్ శ్రీను స్టేజి పైనే రాంప్రసాద్ కు కాల్ చేసి సుధీర్ కు ఇవ్వగా అతను ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 

రాంప్రసాద్ హెడ్ కి సర్జరీ చేయించుకోవడం వల్ల రాలేకపోయాడు అని తర్వాత శ్రీను చెప్పుకొచ్చాడు.  ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రావడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. 

రాంప్రసాద్ సర్జరీ చేయించుకున్న మాట నిజమే కానీ అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అని అతని సన్నిహితుల సమాచారం.