ఆస్పత్రిలో లోకనాయకుడు.. ఆందోళనలో అభిమానులు.!

శుక్రవారం ఉదయాన్నే నిద్రలేవగానే సినిమా అభిమానులకు చిన్న షాక్‌ లాంటి వార్త కనిపించింది. 

అదే లోక నాయకుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారని. చెన్నైలోని పోరూర్‌లో ఉన్న రామచంద్ర హాస్పిట‌ల్‌లో కమల్‌ జాయిన్ అయ్యారట. 

తీవ్ర‌ జ్వ‌రంతో పాటు శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందిగా అనిపించడంతో కమల్‌ను ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు అంటున్నారు. 

పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు అయి ఉంటాయని వార్తలొస్తున్నా.. సరైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. 

కమల్‌ హాసన్‌ రీసెంట్‌గానే బంధు మిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 

కమల్‌ హాసన్‌ రీసెంట్‌గానే బంధు మిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 

బుధవారం హైదరాబాద్ వచ్చి ప్రముఖ దర్శకుడు కె.విశ్వ‌నాథ్‌ని క‌లిశారు కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. 

కమల్ హాసన్ హాస్పిటల్‌లో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. 

తమ అభిమాన నాయకుడికి ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. అయితే అంత ఇబ్బంది ఏం లేదని తమిళ వర్గాల సమాచారం.

అయితే సోషల్‌ మీడియాలో, కొన్ని మీడియాల్లో కమల్‌ హాసన్‌ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. 

తీవ్ర అనారోగ్యమని, ఏమైందో అంటూ వార్తలొస్తున్నాయి.అయతే తమిళ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే… 

కమల్‌ హాసన్‌ జనరల్‌ చెకప్‌ కోసమే వచ్చారు అని అంటున్నారు. అయితే కాస్త ఒంట్లో నలతగా ఉండటంతో..

రెండు పనులూ అయిపోతాయని ఆస్పత్రిలో చేరారు అని అంటున్నారు. దీనిపై మరికాసేపట్లో హెల్త్‌ బులిటెన్‌ కానీ, ప్రకటన కానీ ఉండొచ్చు అని చెబుతున్నారు. 

అస్వస్థత ఇటీవల ‘విక్రమ్‌’ సినిమాతో మాంచి హిట్‌ కొట్టిన కమల్‌.. ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ సినిమా పనుల్లో ఉన్నారు. మరోవైపు తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు.