మంజిమా మోహన్- గౌతమ్ కార్తీక్ ల ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పిక్స్ వైరల్..!

కోలీవుడ్ ప్రేమ జంట అయిన గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ ల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. 

బుధవారం నాడు వీరి పెళ్లి డేట్ ను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.

న‌వంబ‌ర్ 28న చెన్నైలో వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుగబోతుంది.

గౌత‌మ్‌, మంజిమా… మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

 2019లో ‘దేవ‌ర‌ట్టం’ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. 

ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడటం… తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది. 

‘మూడేళ్లుగా కష్టసుఖాల్లో మంజిమా నా వెన్నంటి నిలిచింది, క‌ఠిన ప‌రిస్థితుల్లో ధైర్యంగా ముంద‌డుగు వేసేలా త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. 

తను నా ప‌క్క‌న ఉంటే ఏ అవ‌రోధానైన్నా ఎదుర్కోగ‌ల‌న‌నే న‌మ్మ‌కం నాకు కలిగింది’ అంటూ వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు గౌత‌మ్ కార్తిక్‌. 

నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మంజిమా మోహ‌న్‌…

అటు తర్వాత ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో నారా భువనేశ్వరి పాత్రలో అంటే రానా(చంద్రబాబు) భార్య పాత్రలో ఈమె నటించింది. 

ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడంతో.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లో బిజీగా గడుపుతుంది ఈ జంట. 

అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు క్యూట్ పెయిర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి.