2023 లో నరేష్ – పవిత్ర ల పెళ్లి.. లిప్ లాక్ వీడియోతో అనౌన్స్మెంట్!

నరేష్ – పవిత్ర ల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరంలేదు. చాలా కాలంగా వీళ్ళు కలిసి జీవిస్తున్నారు. 

అదే సహజీవనం అనమాట. నరేష్ కు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతితో.. 

ఇంకా విడాకులు తీసుకోలేదు అని మొన్నటి వరకు ఆమె మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసింది. ఇదిలా ఉండగా.. 

నిన్న మొన్నటి వరకు నరేష్ – పవిత్ర .. తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. కానీ హ్యాపీగా కలిసి తిరగేస్తూ వచ్చారు. 

ఇందిర గారు, కృష్ణ గారు చనిపోయిన టైంలో కూడా ఈ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అంతేకాకుండా కర్ణాటకలో ఉన్న ఓ హోటల్ లో వీళ్ళు బస చేస్తూ ఉండగా.. 

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వచ్చి వీళ్ళను మీడియాకి పట్టించింది. ఇదిలా ఉండగా.. మొత్తానికి ఈ జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. 

2023 లో నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని కోరుకుంటున్నారు.

ఆ విషయాన్ని ఓ వీడియో ద్వారా రివీల్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 

ఈ వీడియోలో నరేష్ – పవిత్ర లిప్ లాక్ పెట్టుకోవడం. లేటు వయసులో వీళ్ళ రొమాన్స్ చూసి నెటిజన్లు బిత్తరబోయారనే చెప్పాలి. 

ఇక వీడియోలో మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ జంట కోరింది.