కోలుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పూజా హెగ్డే.. వీడియో వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. కొంతకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉంటుంది. ఎందుకో అందరికీ తెలిసే ఉంటుంది. 

మొన్నామధ్య ఈమె షూటింగ్‌ స్పాట్ లో గాయపడింది.’లిగ్మెంట్ టియర్’ అయ్యిందని ఓ ఫోటో ద్వారా పూజా హెగ్డే ఈ విషయాన్ని తెలిపింది. అలా అని కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నట్లు తెలిపింది. 

కానీ ఇప్పటికీ ఆమె నడవలేకపోతున్నట్టు స్పష్టమవుతుంది. ఆమె కాలికి గాయమై నెల రోజులు దాటినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఫిజియోథెరపిస్ట్ సాయంతో చికిత్స తీసుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తుంది. కాలు బెనకడం అనేది వినడానికి చిన్న విషయమే కానీ అది ఈమెకు కొంచెం తీవ్రంగానే అయ్యిందని వినికిడి. 

అందుకోసమే ఫిజియోథెరపిస్ట్ సూచనల మేరకు కఠినంగా శ్రమిస్తూ కోలుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

“ సరిగ్గా రెండు వారాల క్రితం… నా జీవితంలో రెండోసారి నడక నేర్చుకోవడం స్టార్ట్ చేసిన సందర్భం అది.

ఇలాంటి టైంలో మన మైండ్‌ బ్లాంక్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం అనేది అర్థం కాదు” అంటూ ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చిన పూజా హెగ్డే.. 

మరో వీడియోకి “కింద పడు..పైకి లేవడానికి ట్రై చెయ్యి.. పోరాడు.. పైకి లేస్తూనే ఉండు..” అంటూ కామెంట్ పెట్టింది. 

పూజా హెగ్డే నడవడానికి ట్రై చేస్తున్న వీడియోలను చూసిన అభిమానులు ఆమె కోలుకుంటున్నందుకు సంబరపడిపోతున్నారు” ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి.