న్యూజిలాండ్‌లో న్యూ లుక్‌తో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు..

తిరిగి హైదరాబాద్ వచ్చి.. మళ్లీ న్యూజిలాండ్ వెళ్లాడు. చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో..

దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ RC 15.. పలు కారణాలతో ఇప్పటివరకు షూటింగ్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది.

రీసెంట్‌గా న్యూ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది టీం.. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో సాలిడ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్ శంకర్.

దీనికోసం చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. పాపులర్ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్‌ హకీం , చరణ్‌ని స్టైలిష్ అండ్ ఛార్మింగ్ లుక్‌లోకి మార్చేశారు.

మోడ్రన్ వేర్‌లో బ్యూటిఫుల్ స్మైల్‌తో ఆలిమ్‌ హకీంతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు మెగా పవర్ స్టార్.. చెర్రీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.