‘యశోద’ సినిమాకి పెద్ద షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ కారణం వల్లేనా..!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీగా రాణిస్తుంది. 

10వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ అన్ సీజన్ లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. 

టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ తన హవా చూపిస్తుండడం.. సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసింది. 

ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సమంత యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది అనే టాక్ వచ్చినప్పటి నుండి.. కొందరు ఓటీటీకి ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూడటం మొదలుపెట్టారు. 

డిసెంబర్ 9 నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.కానీ ఇప్పుడు యశోద ఓటీటీ రిలీజ్ కి కోర్టు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

ఎందుకంటే సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ‘యశోద’ మూవీలో ఇవా హాస్పిటల్ నేపథ్యంలో కథ రన్ అయినట్టు చూపించార.

ఇప్పుడు ఇదే యశోద కి చిక్కులు తెచ్చిపెట్టింది. అది ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా ఉందని.. ఇవా యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

‘యశోద’ లో నేరుగా హాస్పిటల్ పేరు చూపించారు..సినిమా చూసినప్పుడే ఈ అనుమానం చాలా మందికి వచ్చింది కానీ.. 

అందుకు పర్మిషన్ వంటివి ఉన్నాయేమో అని అంతా భావించారు.

కానీ ఇవా హాస్పిటల్ వారు లేటుగా ఈ విషయం పై రియాక్ట్ అయినట్టు స్పష్టమవుతుంది. దీంతో యశోద ప్రొడక్షన్ కు కోర్టు నోటీసులు పంపడం జరిగింది.

ఈ క్రమంలో డిసెంబర్ 19 వరకు ‘యశోద’ ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదు. 

తదుపరి విచారణ డిసెంబర్ 19 కి వాయిదా వేశారని సమాచారం.