ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. హిందీలో రాజ్ కుమార్ రావుతో శైలేష్ కొలను రీమేక్ చేయగా మంచి స్పందన వచ్చింది..డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

కోలీవుడ్ యంగ్ స్టార్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త.. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ హీరో హీరోయిన్లుగా.. మాస్ మహారాజా రవితేజ నిర్మాణంలో.. కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తీ’.. చెల్ల అయ్యావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 2న తమిళ్ (గట్ట కుస్తీ), తెలుగులో విడుదలవుతోంది.

వెర్సటైల్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మరో డబ్బింగ్ బొమ్మతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరో విలక్షణ నటుడు బాబీ సింహాతో కలిసి నటించిన ‘జల్లికట్టు బసవ’ డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్. ఆర్.పన్నీర్ సెల్వం డైరెక్టర్..

బాలకృష్ణ కోల, గీత షా, రాజా రవీంద్ర, సాక్షి చౌదరి, ప్రభాకర్‌, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరెక్కిన ’నేనెవరు?’ సినిమా డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది.

డిసెంబర్ 2

డిసెంబర్ 2

డిసెంబర్ 1

డిసెంబర్ 2

క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ – (వెబ్ సిరీస్) – నవంబర్ 29 మై నేమ్ ఈజ్ వెండెట్టా – (ఇటాలియన్ మూవీ) – నవంబర్ 30 ట్రోల్ – (నార్వేజియన్ మూవీ) – డిసెంబర్ 1 జంగిల్ లాండ్ (హాలీవుడ్) – డిసెంబర్ 1 గుడ్‌బై – (హిందీ) – డిసెంబర్ 2 లవ్‌టుడే (తమిళ్) – డిసెంబర్ 2

విల్లో – (వెబ్ సిరీస్) – నవంబర్ 30 రిపీట్ (తెలుగు) – డిసెంబర్ 1 డైరీ ఆఫ్ ఎ వింపీకిడ్ : రోడ్రిక్ రూల్స్ – డిసెంబర్ 2 ఫ్రెడ్డీ (బాలీవుడ్) – డిసెంబర్ 2 మాన్‌స్టర్ (మలయాళం) – డిసెంబర్ 2

ఇండియన్ లాక్‌డౌన్ (బాలీవుడ్) – డిసెంబర్ 2 మాన్‌సూన్ రాగా (బాలీవుడ్) – డిసెంబర్ 2

క్రష్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2) – డిసెంబర్ 2 కాంతార (తుళు) – డిసెంబర్ 2 వదంతి – (వెబ్ సిరీస్) – డిసెంబర్ 2