ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

‘లారీ డ్రైవర్’.. ‘బాలయ్య బాలయ్య జయమ్మ జయమ్మ’ సాంగ్ అయితే ఓ ఊపు ఊపింది.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ సాంగ్..

బంగారు బుల్లోడు.. ‘తధిగినతోం తధిగినతోం బాలయ్యో..ఇటు రావయ్యో’.

‘నరసింహ నాయుడు’ లోని ‘లక్స్ పాప’ పాటలోని చరణంలో ‘హరేరామ హరేకృష్ణా.. బెండుతీసేయ్ బాలకృష్ణా’ అని వస్తుంది..

సీమసింహం’ మూవీలో ‘కోకా రైకా’ పాట చివర్లో ‘బాలయ్యో..ఏం గోలయ్యో’ అని వస్తుంది..

‘మహారథి’ లో ‘ఒట్టు పెట్టి చెప్పుతాను’ పాటలో కోరస్‌గా పలుసార్లు ‘బాలకృష్ణ’ అని వస్తుంది..

‘మిత్రుడు’ మూవీలో ఫస్ట్ సాంగ్ అను పల్లవిలో ‘గోపాల బాలకృష్ణా అంటూ వాయించెయ్ నా మురళిని’ అని కూడా వస్తుంది..

‘అఖండ’.. అయ్యా బాలయ్య అంటూ మొదలయ్యే ఈ సాంగ్.. ‘యా యా జైై బాలయ్య’ అంటూ ఏ రేంజ్‌లో రచ్చ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేసింది..

‘వీర సింహా రెడ్డి’.. ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు.. తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారి కోసం.. అగ్గిమంటే నీ ఆవేశం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేడే లేడయ్యా.. ఆ మెలతాడు కట్టిన మొగోడింకా పుట్టనేలేదయ్యా.. జై బాలయ్య.. జై జై బాలయ్య’’.. ఈ లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది..

‘సమర సింహా రెడ్డి’.. ‘నందమూరి నాయకా.. అందమైన కానుకా’.. ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది..

‘గొప్పింటి అల్లుడు’.. ఈ మూవీలో ‘నీ హైట్ ఇండియా గేటు’ అంటూ బాలయ్య, సిమ్రాన్‌ని టీజ్ చేసే సాంగ్ ఒకటి ఉంటుంది.. సెకండ్ చరణంలో.. ‘నందమూరి వాణ్ణే.. కురిపిస్తా మార్వెలెస్ ప్రేమ’ అని వస్తుంది..

‘నరసింహ నాయుడు.’. ‘చిలక పచ్చ కోకా’.. పాటలో.. ‘చెయ్యేస్తే పులకరింతలే.. ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే’ అనే లైన్ ఉంటుంది..