పెళ్లాడనున్న ప్రియదర్శి!

  • January 31, 2018 / 08:21 AM IST

“పెళ్ళిచూపులు” సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకొన్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, రీతువర్మ అనంతరం నటనతో ఆకట్టుకొన్న మరో వ్యక్తి ప్రియదర్శి. “నా సావు నేను సస్తా నీకెందుకు” అని మనోడు తెలంగాణా యాసలో చెప్పే డైలాగ్ కి థియేటర్ మొత్తం నవ్వింది. ఆ తర్వాత ప్రియదర్శి మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయిపోయాడనుకోండి. కేవలం 2017లోనే ప్రియదర్శి 14 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మనోడి చేతిలో 10కి పైగా సినిమాలున్నాయి.

ఇకపోతే.. కెరీర్ పరంగా కాస్త లేట్ గా సెటిల్ అయిన ప్రియదర్శి పర్సనల్ లైఫ్ లో మాత్రం త్వరగా సెటిల్ అవ్వాలనుకొన్నాడు. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా పెళ్ళికి రెడీ అయిపోయాడు. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకొంటున్నాడట. ఇటీవల పెళ్ళిచూపులు కూడా అయిపోయాయి. హైద్రాబాద్ బేస్డ్ రిచా శర్మా అనే అమ్మాయిని ప్రియదర్శి పెళ్లాడనున్నాడు. ఫిబ్రవరి 23న ప్రియదర్శి-రిచా శర్మాల వివాహ వేడుక హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది.

ప్రియదర్శికి తెలుగుతోపాటు తమిళంలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఫిబ్రవరిలో పెళ్లి అనంతరం ఒక 15 రోజుల గ్యాప్ తీసుకోవాలనుకొంటున్నాడట. అందుకే కొత్త సినిమాలేమీ ఇంకా అంగీకరించట్లేదు. మళ్ళీ మార్చ్ నుంచి సినిమాల్లో బిజీ అయిపోతాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus