ట్రైలర్లతో క్రియేట్ చేసిన సెన్సేషన్.. సినిమాకి ఉపయోగపడలేదు!

ఓ ఏడాది క్రితం భారత ప్రభుత్వం పోర్న్ బ్యాన్ చేసింది. యువత అంతా సదరు సైట్స్ ఓపెన్ చేయడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతుండగా.. ఆదేరోజు “ఏడు చేపల కథ” అనే సినిమా మొదటి టీజర్ ను విడుదల చేసింది. ఆ సినిమా టీజర్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే.. కుర్రాళ్ళు పోర్స్ సైట్స్ ఓపెన్ అవ్వడం లేదనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత సెకండ్ టీజర్ రిలీజ్ చేసి మళ్ళీ అదే స్థాయి ప్రకంపనలు సృష్టించారు దర్శకనిర్మాతలు. యూట్యూబ్ & మీమ్ పేజస్ లో రచ్చ చేసిన “ఏడు చేపల కథ” నేడు విడుదలవుతోంది.

ఈ సినిమా ఇవాళ విడుదలవుతోందన్న విషయం చాలా మందికి తెలియదు. టీజర్, ట్రైలర్ విడుదల విషయంలో చూపిన తెలివి.. సినిమా రిలీజ్ విషయంలో ఎందుకు చూపించలేదు అనేది దర్శకనిర్మాతలకే తెలియాలి. సినిమా మొత్తంలో భాను ఒక్కర్తే కాస్త తెలిసిన ముఖం. మిగతా వాళ్ళందరూ కొత్తవాళ్లే. అయితే.. ఈ సినిమాలో లెక్కకు మించిన శృంగార సన్నివేశాలు, బోలెడు మంది యువతల అందాల ఆరబోత ఉండడంతో సినిమాకి జనాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారని దర్శకుడు భావించాడేమో. మరి వాళ్ళ స్ట్రాటజీ ఏమేరకు వర్కవుట్ అయ్యింది? ఈ సినిమా “బస్టాప్, గుంటూరు టాకీస్” తరహాలో సెన్సేషనల్ హిట్ సాధించించగలిగిందా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus