పవన్ ని ఆ స్ధాయిలో చూడాలనుకుంటున్న గణేష్!

ఒక చిన్న కమీడీయన్ గా కరియర్ మొదలు పెట్టి….కుటుంభంతో కలసి చూడలేని సినిమాల్లో నటించి….ఒకప్పుడు అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ లో రేయింబవళ్లు తిరిగిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ రాత్రికి రాత్రే బడా నిర్మాతగా ఎలా మారాడో….ఆయన వెనుక ఎవరు ఉన్నారో అది జగం ఎరిగిన సత్యం..అయితే అదే గణేశ్ బడా హీరోలతో సినిమాలు తియ్యగానే….ఒక బడా వ్యక్తిగా మారిపోయాడు…నన్ను ఎవ్వడూ టచ్ కూడా చెయ్యలేడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు…అయితే ఇదిలా ఉంటే సహజంగానే మెగా ఫ్యామిలీకి తొత్తుగా వ్యవహరించే ఈ ప్రముఖ నిర్మాత…తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై అదేవిధంగా అతడి ‘జనసేన’ పార్టీ పై పలు ఊహలతో కూడిన సంచలన వ్యాఖ్యలు చేసాడు. త్వ‌ర‌లోనే తాను రాజ‌కీయ అరంగేట్రం చేసి భ‌విష్య‌త్తులో మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టడం ఖాయం అని అంటూ ఇది అంతా ‘జనసేన’ పార్టీ వల్లే జరుగుతుందని మెగా ట్విస్ట్ ఇచ్చాడు ఈ మెగా ప్రొడ్యూసర్.

అంతేకాదు 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి చేపట్టడం ఖాయం అని అంటున్నాడు. ఇదే సందర్భంలో ఈయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వార్ వన్‌ సైడ్ అవుతుందనీ పవన్ ఆ ఎన్నిక‌ల్లో తప్పక గెలుస్తాడ‌ని బండ్ల  అభిప్రాయ పడుతున్నాడు.అసెంబ్లీలో ఒక‌సారి ‘అధ్యక్షా’ అని పిలవాలనుందనీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల‌ని కూడా ఉంద‌ని రాజ‌కీయాల్లో తనకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను అని అంటూ తన కలలను బయట పెట్టాడు ఈ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. మొత్తానికి పవన్ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతాడొ తెలీదు కానీ….పవన్ పార్టీపైనా ఆయన ఇచ్చే అవకాశం పైనా మాత్రం ఈ నిర్మాత చాలా ఆశలే పెట్టుకున్నాడు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus