Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

ఇద్దరు హీరోలు.. రెండు భిన్న ప్రపంచాలు.. విదేశీ నటుల, విదేశాల్లో చిత్రీకరణలు.. ఇలా చాలా విషయాలు అలాంటి సినిమాను 315 రోజుల్లో పూర్తి చేశారు రాజమౌళి. అదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలో ముగ్గురు స్టార్‌ నటులు. మూడు లోకాలు, మూడు కాలమాన పరిస్థితులు, విదేశాలు, ఇతిహాసాల టచ్‌.. ఇలా కాన్వాస్‌ పరంగా కానీ, క్యారెక్టర్ల పరంగా కానీ చాలా పెద్ద సినిమా అది. అదే ‘వారణాసి’.

Rajamouli

మామూలుగా అయితే రాజమౌళి స్పీడ్‌ ప్రకారం ఈ సినిమా ఏ 350 రోజులో లేక 400 రోజులో అవ్వాలి షూటింగ్‌కి. కానీ ఆయన కేవలం 275 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తన గత సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ‘వారణాసి’ ఆరు రెట్ల పెద్ది. అలాంటి సినిమాను అంత త్వరగా ఎలా పూర్తి చేయగలిగారు అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో రాజమౌళిలో వచ్చిన మార్పు ఏంటి అనేది చూస్తే.. ఈ సినిమా కోసం ఆయన చాలా ఎక్కువ హోమ్‌ వర్క్, పేపర్ వర్క్ చేశారు. మొత్తం పేపర్‌పై పెట్టి, లెక్క కట్టి షూటింగ్‌లోకి అడుగుపెట్టడంతో, సినిమా చిత్రీకరణ రోజులు తగ్గాయి. అలా పేపర్ వర్క్ ఎక్కువగా చేయడం వల్ల 40 రోజుల షూటింగ్ టైం తగ్గించుకున్నాం అని చెప్పారు జక్కన్న. అంతే కాదు ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన అనుభవం ‘వారణాసి’ సినిమాకు ఉపయోగపడింది అని చెప్పారు.

దానికి తోడు తన గత సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం సెట్స్‌ వినియోగించారు అని చెప్పొచ్చు. వాటికితోడు ఏఐ వినియోగం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది అని చెబుతున్నారు. అంటార్కిటికాలోని మంచు కొండల్లో తీయాల్సిన సీన్స్‌ని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే తీసేశారు. కెన్యా వెళ్లి తీద్దాం అనుకున్న అడవి నేపథ్య సన్నివేశాలను ఒడిశాలో పూర్తి చేశారు. ఇలా ఈ కొన్ని మార్పులు కూడా సినిమా వేగంగా పూర్తవడానికి కారణం అని అంటున్నారు. ఈ సంగతి తేలాంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7 రావాలి. అప్పుడు ‘వారణాసి’ గేట్స్‌ ఓపెన్‌ అవుతాయి..

గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus