ప్రభాస్ సినిమా కోసం శ్రద్ధ కపూర్ చేస్తున్న పని ఏమిటంటే ?

  • November 25, 2017 / 12:09 PM IST

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ కోసం అనేకమందిని పరిశీలించారు. కన్నడ బ్యూటీ రష్మిక మందనా, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రాలను కాదని ఈ అవకాశం శ్రద్ధ కపూర్ కి వరించింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కుతోంది కాబట్టి బాలీవుడ్ భామకు సెలక్ట్ చేశారు. శ్రద్ధకి పారితోషికం 9 కోట్లుగా చెప్పుకుంటున్నారు. రెమ్యునరేషన్ కి తగ్గట్టు నటిస్తున్నట్టు సమాచారం. హిందీ డైలాగ్స్ సులువుగా చెబుతున్న ఈ బ్యూటీ.. తెలుగు వెర్షన్ డైలాగ్స్ కూడా చక్కగా పలకాలని ఒక తెలుగు మాస్టర్ ని సెట్స్ కి తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అలాగే రీసెంట్ గా ఆమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయం చెప్పింది. “నాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం నాకు నచ్చదు.

అందుకే సాహో మూవీ తెలుగు వెర్షన్ కి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకుంటా” అని శ్రద్ధ వెల్లడించింది. ఇందుకు డైరెక్టర్, నిర్మాతలు కూడా ఒకే చెప్పారని వివరించింది. బాలీవుడ్ బ్యూటీలు తెలుగు చిత్రాల్లో నటించడమే ఎక్కువ .. అని ఫీలయిపోతుంటారు. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సుందరి డబ్బింగ్ చెప్పుకోలేదు. అటువంటిది తొలిసారి శ్రద్ధ డబ్బింగ్ చెబుతుండడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 200 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ దుబాయ్ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. అక్కడే ఆశ్చర్యకరమైన లొకేషన్లలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, ప్రభాస్ లపై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్ లో శ్రద్ధ కపూర్ కూడా విన్యాసాలు చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus