తెల్ల పంచె.. తెల్ల షర్టు.. అదిరే లుక్

  • May 17, 2016 / 07:29 AM IST

మెగా బ్రదర్స్ తమిళ సినిమాల ఫై మోజు పెంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి “విజయ్ కత్తి” సినిమాను రీమేక్ చేసే పనుల్లో బిజీ ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజయ్ వీరమ్” చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధమై పోయారు. వీరమ్ తమిళం లో సూపర్ హిట్ సాధించింది. ఆ కథను పవన్ కు సూట్ అయ్యేలా రైటర్ ఆకుల శివ మార్పులు చేస్తున్నారు.

పదిహేనేళ్ళ క్రితం ఖుషి ద్వారా పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య ఈ సినిమాకు దర్శకుడు. సూర్య, పవన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఖుషి హిట్ కాగా, రెండో సినిమా కొమురం పులి భారీ ఫ్లాప్. ఇది మూడో సినిమా. ఫెయిల్ కాకూడదనే ఆల్రెడీ హిట్ అయిన కథను తీసుకున్నారు. ఇందులో పవన్ ఇప్పటి వరకు కనిపించని క్యారెక్టర్ లో మెరవబోతున్నారు. తెల్ల షర్టు, తెల్ల పంచె కట్టుకుని, కత్తి చేత బట్టి పోరాడే ఫ్యాక్షన్ లీడర్ గా అలరించనున్నారు. అదే డ్రెస్ లో ఫిలిం ఓపెనింగ్ కి పవన్ వచ్చారు. ఈ ఫ్యాక్షన్ లీడర్ కి లవ్ స్టోరిని జత చేశారు. ఇక పవన్ యాక్షన్ల, లవ్ ఒకే సినిమా లో మనం చూడవచ్చు.

ఈ సినిమాకు మొదట్లో ఖుషి 2 అని పేరు అనుకున్నారు. కాని ఇంత కంటే మంచి పేరు పెట్టడానికి టీం ఆలోచిస్తోంది. హీరోయిన్ గా శృతి ఖరారు అయింది. ఇక టైటిల్ ఒక్కటే బాలెన్సు ఉంది. ఈ మూవీ కోసం
అనూప్ రూబెన్స్ ఇప్పటికే మూడు పాటలు కంపోజింగ్ పూర్తి చేశారు. షూటింగ్ జూన్ 1 నుంచి మొదలవుతుందని నిర్మాత శరత్ మరార్ చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus