వైసీపీ నాయకులు, ముఖ్యంగా విజయసాయిరెడ్డిగారు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా నాయకులు, గల్లీ నాయకులు.. ఎవరైనా సరే.. పదవులు వరించాక.. వారి వారి వ్యాపారాలు వదిలేశారా? జగన్ సాక్షి మూసేశారా? భారతీ సిమెంట్ వదిలేశారా? దేశవ్యాప్తంగా ఉన్న ఆయన వ్యాపారులు పక్కనపెట్టి ప్రజాసేవలో పునీతమవుతున్నారా? వైసీపీలో 152 మంది ఎమ్మెల్యేలున్నారు..మరి వాళ్లందరూ వారి వారి వ్యాపారాలు పక్కనపెట్టి ప్రజాసేవే పరమావధిగా బతుకుతున్నారా? ఎన్నికలు జరిగిన ఈ ఆరు నెలల ముందు కానీ తర్వాత కానీ ఎవ్వరూ.. ఒక్కరు కూడా.. వారి వ్యాపారాలు వదల్లేదు. అది తప్పు కూడా కాదు.
కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తానంటే తప్పు. ముఖానికి రంగేస్తే దుకాణం మూసేసినట్టు. ఇదెక్కడి న్యాయం..?అందరికీ ఒక న్యాయం.. కళ్యాణ్ కి ఒక న్యాయమా? కళ్యాణ్ కళాకారుడు.. ఆయన వృతి నటన.. ఆయన పని ఆయన చేసుకుంటే దుకాణం మూసేసినట్టా? అది కరక్టేనంటారా? ఈ రోజు కల్యాణ్ సినిమా చేస్తానంటే 50కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటంలేదు. అంత క్రేజ్ ఉండి కూడా.. టాలీవుడ్ టాప్ స్టార్ అయ్యుండి కూడా.. ప్రజల కోసం రెండేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నారు కల్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ నేడు సినిమా చేస్తే తప్పేంటి?. అలా మళ్ళీ సినిమాలు చేస్తే దుకాణం సర్దేసినట్లేనా? ఇదేం పోకడ, ఇదేం రాజకీయం.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!