ఉపాసనకు కోపం తగ్గడానికి పాటించే చిట్కా ఇదే..!

  • November 10, 2017 / 08:23 AM IST

వేలమందికి బాస్ అయినప్పటికీ.. ఇంట్లో మాత్రం ఒక మంచి కోడలిగా, భార్యగా నడుచుకుంటోంది ఉపాసన. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్  చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. అయితే అప్పుడప్పుడు చరణ్ పనులకు కోపం వస్తుందంట.. ఏ పనులకు కోపం వస్తుందో చెప్పలేదు కానీ.. ఆ కోపాన్ని ఎలా పోగొట్టుకుంటుందో వెల్లడించింది. ” ఎప్పుడైనా మిస్టర్.సి (చరణ్)పై కోపం కలిగితే. ఎంతో క్యూట్ గా ఉండే ఈ ఫొటోను చూస్తాను. క్షణాల్లో కోపమంతా కరిగిపోతుంది” అని ట్విట్టర్లో పోస్ట్ తో పాటు ఆ ఫోటోని పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో ముద్దొస్తున్న ఆ చిన్నారి ఎవరో కాదు.. రామ్ చరణ్. ఈ బుల్లి మెగా పవర్ స్టార్ ని చూసి ఫ్యాన్స్ సైతం మురిసిపోతున్నారు. అంతేకాదు రామ్ చరణ్ కి వారసుడిని ఇవ్వడానికి ఉపాసన సిద్ధమవుతోందని అభిమానులు సంబరపడిపోతున్నారు. అందుకే ఈ ఫోటోని షేర్ చేసిందని భావిస్తున్నారు. ఏమో ఉపాసన మనసులోనూ ఇదే ఉందేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus