పాపం సందీప్ కిషన్.. నో యూజ్..!

  • November 21, 2019 / 08:01 PM IST

వరుస ప్లాపులతో సతమతవుతున్న సందీప్ కిషన్ కు ‘నిను వీడని నీడను నేనే’ వంటి సినిమాతో హిట్ కొట్టి కాస్త రిలీఫ్ అయ్యాడు. అదే జోష్ తో జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రానికి మొదటి షో నుండే ప్లాప్ టాక్ వచ్చింది. మొదటి రోజైతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. రివ్యూలు కూడా చాలా నెగెటివ్ గా రావడంతో రెండో రోజు నుండీ ఈ చిత్రానికి బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ‘నెగిటివ్ రివ్యూలు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు మా సినిమా బాగా ఆడుతుంది.. థియేటర్ కు వెళ్ళి చూసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అంటూ డైరెక్టర్ తో సహా హీరో, నిర్మాతలు క్రిటిక్స్ పై మండిపడ్డ సంగతి తెలిసిందే.

సోమవారం నుండీ అయితే కనీసం కల్లెక్షన్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోతుంది. ఇప్పుడు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి.. హీరో సందీప్ కిషన్ తన బాధను వ్యక్తం చేసాడు… ‘కొన్ని రోజులు గ‌డిచాక సినిమా రిజ‌ల్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడ‌దామ‌ని ఇప్పటి వరకూ ఆగాను. నేను ఏఎంబీ సినిమాస్‌తో పాటు మ‌రో మ‌ల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్‌కు వెళ్ళి సినిమా చూశాను. 70 శాతం… ప్రేక్ష‌కులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ బాగుంద‌ని అంటున్నారు. చాలా మంది కాల్ చేసి బాగోద‌నే ఉద్దేశంతో సినిమాకు వెళ్ళి.. బాగుందే అని అంటున్నారు. వాళ్ళకు ముందే ఆ ఫీలింగ్ ఎందుకు క‌లిగిందో అర్థం కాలేదు. అయితే మా సినిమా అంద‌రూ బాగుందంటున్నా క‌లెక్ష‌న్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత వ‌చ్చిన నా గ‌త సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు కూడా ఈ చిత్రానికి రాలేదు. మంచి సెట‌ప్ ఉండి.. కామెడీ జాన‌ర్లో న‌వ్వించే సినిమా తీసినా అనుకున్న‌ట్లుగా కలెక్షన్లు రాక‌పోవ‌డం నిరాశ క‌లిగిస్తోంది. థియేట‌ర్ల‌కు వెళ్ళి సినిమా చూస్తే క‌చ్చితంగా బాగా న‌వ్వుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus