అయ్యో ‘టాప్ 5’ చేరుకోలేకపోయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్..!

  • July 8, 2020 / 12:15 PM IST

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ మరో వారంలో ముగుస్తుంది. ఇప్పుడు హౌస్ లో రాహుల్,శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి వంటి వారు మాత్రమే ఉన్నారు. ఒక్క రాహుల్ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని పై ఆసక్తి నెలకొంది. ఈ అయిదుగురిలో నిన్నటి ఎపిసోడ్ లో అనూహ్యంగా బాబా భాస్కర్ కూడా సేఫ్ అయ్యాడు. మిగిలిన వారిలో ఎవరు సేఫ్ అయ్యింది.. ఎలిమినేట్ అయ్యేది నాగార్జున చెబుతారు అని ‘బిగ్ బాస్’ చెప్పాడు.

ఇక శ్రీముఖి, వరుణ్ సందేశ్ లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు వారికి ఓట్లు కూడా భారీగానే పడ్డాయి. దీంతో వారు సేఫ్ అయిపోయారు. ఇక మిగిలింది అలీ, శివ జ్యోతి. వీరిద్దరిలో కాస్త శివజ్యోతి స్ట్రాంగ్ కంటెస్టెంట్. అయితే ఆమె గతవారం.. వరుణ్ సందేశ్, వితిక ల పై నోరు పారేసుకుని ఎప్పుడూ లేని నెగిటివిటీని మూటకట్టుకుంది. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. దీంతో అలీ సేఫ్ అయ్యాడు. శివజ్యోతి పక్కా ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ఆమె ఓపికగా టాస్క్ లు ఆడుతూ.. ఎంతో జాగ్రత్తగా ప్రతీ ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉండే శివజ్యోతి.. ఒక్క వరుణ్ విషయంలో బ్యాడ్ అయిపొయింది. కచ్చితంగా ‘టాప్ 5’ లో ఉంటుంది అనుకున్న శివజ్యోతి ఇలా ఎలిమినేట్ అవ్వడం ఆమె అభిమానుల్ని బాధపెట్టే అంశమే అనడంలో సందేహం లేదు..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus